Thursday, November 29, 2007
Wednesday, November 28, 2007
ప్రియమైన స్నేహితులారా,అందరికి ఇవే నా అభినందనలు.
ముందుగా ఈ బ్లాగు ప్రారంభించిన కిషొర్ కి నా ధన్యవాదాలు.
మీకందరికీ తెలుసు...నేను Infosys లో చేరానని. ప్రస్తుతం అందులోనే ఉన్నాను. ఆమెరికా లో మిన్నెసొటా అనే రాష్ట్రం లో పని చేస్తున్నాను.ఇవి నా విశేషాలు.
ఇంక నుండి బొలెడన్ని సంగతులు, మన కాలేజి రోజులు ఈ బ్లాగు ద్వారా నెమరు వేసుకొవాలని ఆశిస్తూ
ఇట్లు,
హిమ బిందు
Note: (ఏ హిమ బిందు అని మీ అనుమానం కదా!!!...జైలు బిందు :) )
Monday, November 26, 2007
Falling Leaves .......
I was thinking of old friends today
and how many of them have slipped away.
Moved, got married, or stopped calling so much,
Found new friends, got busy, and just lost touch.
It reminded me of falling leaves .
Every autumn the leaves fall from the trees.
Some stay longer than others, but eventually -
Each leaf must fall, I'm told,
leaving the tree alone to face the cold.
Why is it that in the time of utmost need
the leaves would seek to leave the tree?
And when we need our friends around
we look and they cannot be found?
Of course these friendships come and go
and in the spring new leaves will grow.
But I prefer autumn friends of old
with crackling laughter and colors bold.
And then I thought of you.
That one stubborn leaf that won't let go.
That clings despite the winds that blow.
Fighting ice, and snow, and winter's stings
Hanging on right through till spring.
So I guess that's what you are to me -
The very last leaf to leave the tree.
I know it seems silly, but it's true.
When I see that last leaf...I think of you.
....don't drift away.... will you???
Saturday, November 24, 2007
మీ కోసం ఈ ఛాయాచిత్ర సమాహారం ....Just for you....
హ్యాపీడేస్
మా చెన్నపట్నంలో తెలుగు సినిమాలు చాలా తక్కువగా వస్తాయి, అందరూ హ్యాపీడేస్ చాలా బాగుంది అంటే ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఎదురు చూసాను. గొప్ప సినిమా కాకపోవచ్చు కానీ, మంచి టైంపాస్ సినిమా. అది చూసాక మన హ్యాపీడేస్ కూడా గుర్తు వచ్చి ఇది రాస్తున్నా...
అందులో ఫస్టాఫ్ అంతా మనం చేయించుకున్న, మనం చేసిన రాగింగ్ గుర్తు చెసింది. ఒక కాలి పాంట్, ఒక చేతి షర్ట్ మడత పెట్టి హేల్ బుల్లయ్య అంటూ రాగింగ్ స్టైల్ లో సీనియర్స్ కి సెల్యూట్ చెయ్యడం, నీళ్ళు లేకుండా ఈత కొట్టించడం, అగ్గిపుల్లతో రూం పొడవు వెడల్పులు కొలవడం, సీనియర్ ల పేర్లు కనుక్కోవడం, మన బాచ్ మన జూనియర్స్(ఏదో గ్యాప్ గురించి అడిగి...) తో గొడవ పడడం, ర్యాగింగ్ లో భాగంగా మన సీనియర్లు నన్ను, డిక్కి ని రామా టాకీస్ లో "మా ఆయన బంగారం" అనే ఒక ఆణిముత్యాన్ని టికెట్ కొని మరీ సెకండ్ షో చూపించడం, మనం వేసిన హరిశ్చంద్ర నాటకం...అన్నీ ఒక్కసారి రీల్ లాగా తిరిగాయి.
సెకండాఫ్ లో ఒకొక్కడికి ఎన్నెన్ని క్రష్ లు ఉన్నాయో అవన్నీ గుర్తు వచ్చి ఉంటాయి. మనం అరకులో చేసిన అల్లరి, విజయనగరం లో పైడిమాంబ సిరిమానోత్సవం కోసం గోపాల్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం, అరసవిల్లి చూడడం కోసం రామన్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం, కోనసీమ చూడడం కోసం రామరాజు, ప్రసన్న, జి. శ్రీనివాస్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం, అంతర్వేది చూడడం కోసం కిషోర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడం అన్ని గుర్తుకొచ్చాయి.
పరీక్షల ముందు మనం చేసిన నైట్ అవుట్ లు, కంబైండ్ స్టడీస్, అనదరూ సీరియస్ గా చదువుతూ ఉంటె గౌతం సినిమాలకెళ్ళడం, ఎవడి పుట్టిన రోజయినా డిక్కి వండేసే బిరియాని.....ఇలా అన్ని ఒక్కసారి గుర్తు వచ్చాయి....
--రామకృష్ణ బైసాని.
Friday, November 23, 2007
మన జట్టు తరువాతి తరానికి తాజా చేర్పులు (Next Generation continues to grow))
*And also Archana became mom of a sweet little girl Megha on Nov 9th '07
Apart from the above
Choudary and Gopal are dads of baby boy.
So as Saritha and Samyuktha moms of baby boy.
You already konw about the children of Vasundhara(2 sons) and Rajani(1 daughter).
As far as my knowledge this is the list so far....
మిత్రులారా.... వందనాలు..
యాహూ గ్రూప్ ఐడి వాడడం మానవేసిన తదుపరి ఆర్కుట్లో ఒక సమాజం(community) సృష్టించాను.
కానీ లాభం లేక పోయింది... చాలా సార్ధవాహికాలలో(Corporate Offices) దానిని నిషేదించిన కారణంగా ఈ బ్లాగును మొదలెట్టాం.....
అందరూ సమయం దొరికినప్పుడల్లా... ఈ బ్లాగులో బ్లాగుతూ మనం మునుపటి రోజులు, ఈనాటి విషయాల గూర్చి చర్చించుకోవచ్చును...
మరిక ఎందుకు ఆలస్యం, ఉత్సాహవంతులారా మీమీ మీటకాలను(Key Boards) మీటండి, ఇకపై ఈ బ్లాగులో ముచ్చటించుకుందాం.......
ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు...
మొదటగా నా గురించి.
2004 ఫిబ్రవరి లో పూణే లో కాన్ బే లో చేరాను, అక్కడ ట్రైనింగ్ తరువాత హైదరాబాద్ వచ్చి అక్కడ సెప్టెంబర్2005 వరకు పని చేశాను. అటు తరువాత చెన్నపట్నం చేరుకుని అప్పటి నుంచి ఇక్కడ వెలగబెడుతున్నాను. 2006 జూన్ మొదటి పదోన్నతి(ప్రమోషన్) తీసుకున్నాను.
2006 ఏప్రిల్ లో వాణి నా జీవితంలోకి ప్రవేశించింది. ఇద్దరం ఉద్యోగస్తులమే కాబట్టి జీవితం సూపర్ ఫాస్ట్ లో పరిగెటుతున్నట్టుగా ఉంది. ఫ్రస్తుతం చెన్నపట్నం వదిలి మన అభాగ్యనగరం ఎప్పుడు చేరతానా అని ఎదురు చూస్తున్నాను.
--రామకృష్ణ బైసాని