మా చెన్నపట్నంలో తెలుగు సినిమాలు చాలా తక్కువగా వస్తాయి, అందరూ హ్యాపీడేస్ చాలా బాగుంది అంటే ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఎదురు చూసాను. గొప్ప సినిమా కాకపోవచ్చు కానీ, మంచి టైంపాస్ సినిమా. అది చూసాక మన హ్యాపీడేస్ కూడా గుర్తు వచ్చి ఇది రాస్తున్నా...
అందులో ఫస్టాఫ్ అంతా మనం చేయించుకున్న, మనం చేసిన రాగింగ్ గుర్తు చెసింది. ఒక కాలి పాంట్, ఒక చేతి షర్ట్ మడత పెట్టి హేల్ బుల్లయ్య అంటూ రాగింగ్ స్టైల్ లో సీనియర్స్ కి సెల్యూట్ చెయ్యడం, నీళ్ళు లేకుండా ఈత కొట్టించడం, అగ్గిపుల్లతో రూం పొడవు వెడల్పులు కొలవడం, సీనియర్ ల పేర్లు కనుక్కోవడం, మన బాచ్ మన జూనియర్స్(ఏదో గ్యాప్ గురించి అడిగి...) తో గొడవ పడడం, ర్యాగింగ్ లో భాగంగా మన సీనియర్లు నన్ను, డిక్కి ని రామా టాకీస్ లో "మా ఆయన బంగారం" అనే ఒక ఆణిముత్యాన్ని టికెట్ కొని మరీ సెకండ్ షో చూపించడం, మనం వేసిన హరిశ్చంద్ర నాటకం...అన్నీ ఒక్కసారి రీల్ లాగా తిరిగాయి.
సెకండాఫ్ లో ఒకొక్కడికి ఎన్నెన్ని క్రష్ లు ఉన్నాయో అవన్నీ గుర్తు వచ్చి ఉంటాయి. మనం అరకులో చేసిన అల్లరి, విజయనగరం లో పైడిమాంబ సిరిమానోత్సవం కోసం గోపాల్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం, అరసవిల్లి చూడడం కోసం రామన్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం, కోనసీమ చూడడం కోసం రామరాజు, ప్రసన్న, జి. శ్రీనివాస్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం, అంతర్వేది చూడడం కోసం కిషోర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడం అన్ని గుర్తుకొచ్చాయి.
పరీక్షల ముందు మనం చేసిన నైట్ అవుట్ లు, కంబైండ్ స్టడీస్, అనదరూ సీరియస్ గా చదువుతూ ఉంటె గౌతం సినిమాలకెళ్ళడం, ఎవడి పుట్టిన రోజయినా డిక్కి వండేసే బిరియాని.....ఇలా అన్ని ఒక్కసారి గుర్తు వచ్చాయి....
--రామకృష్ణ బైసాని.
No comments:
Post a Comment