విశాఖపట్నం లో మూడు సంవత్సరాలు మూడు నిమిషాలలాగ గడిపేసి ఈ విశాల ప్రపంచంలోకి వచ్చి పడ్డాము. అప్పుడే నాలుగేళ్ళు గడచిపోయాయి. అందరం ఎన్నెన్నో అనుభవాలు పొంది ఉంటాము అవన్నీ ఇక్కడ మళ్ళి అందరితో పంచుకునే అవకాశం ఇచ్చిన ఈ సాంకేతిక పరిజ్ఞాననికి జోహార్లు అర్పిస్తూ మన అల్లరి మళ్ళీ మొదలు పెడదామా?????
మొదటగా నా గురించి.
2004 ఫిబ్రవరి లో పూణే లో కాన్ బే లో చేరాను, అక్కడ ట్రైనింగ్ తరువాత హైదరాబాద్ వచ్చి అక్కడ సెప్టెంబర్2005 వరకు పని చేశాను. అటు తరువాత చెన్నపట్నం చేరుకుని అప్పటి నుంచి ఇక్కడ వెలగబెడుతున్నాను. 2006 జూన్ మొదటి పదోన్నతి(ప్రమోషన్) తీసుకున్నాను.
2006 ఏప్రిల్ లో వాణి నా జీవితంలోకి ప్రవేశించింది. ఇద్దరం ఉద్యోగస్తులమే కాబట్టి జీవితం సూపర్ ఫాస్ట్ లో పరిగెటుతున్నట్టుగా ఉంది. ఫ్రస్తుతం చెన్నపట్నం వదిలి మన అభాగ్యనగరం ఎప్పుడు చేరతానా అని ఎదురు చూస్తున్నాను.
--రామకృష్ణ బైసాని
Friday, November 23, 2007
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
ఉపాయం బాగుంది....
Hope we can meet as many friends as possible thoru this means...
Ramki this is for you:...
అంత తొందరేమిట్రా.. నేను మొదటి టపాచేయకుండానే నువ్వు పోస్ట్ వ్రాసావా...
I appreciate your commitment.
Post a Comment