Monday, March 10, 2008
వాదనల వల్ల అభిప్రాయాలు మారవు...
విశాఖపట్నంలో చదువుకునే రోజుల్లో రాజమండ్రి నుంచి వచ్చిన శీనుగాడు, సూర్రెడ్డి ఒక రూములో ఉండేవారు. ఆప్పుడప్పుడూ నేను వాళ్ళ రూముకి వెళ్ళేవాడిని. ఇక్కడ వీళ్ళ గురించి కొంచెం చెప్పాలి. శీనుగాడికి ఏ విషయం అయినా వాదించడం అంటే ఇష్టం.సూర్రెడ్డికేమో ఏదీ తెగేదాకా లాగటం ఇష్టం ఉండదు. మేము ఏదయినా టెక్నికల్ విషయాలు, సబ్జెక్ట్, రాజకీయాలు ఏవయినా కానీ చాలా ఉత్సాహంగా మాట్లాడుకునేవాళ్ళం. శీనుగాడేమో ఏ విషయమైనా సరదాకి వాదన మొదలెట్టేవాడు, ఆ వెంటనే సూర్రెడ్డి "వాదనల వల్ల అభిప్రాయాలు మారవు..." అనేసి అక్కడ నుంచి వెళ్ళిపొయేవాడు. అప్పట్లో నాకు అర్దం కాలేదు కానీ, చెన్నపట్నం వచ్చాక ఆ డైలాగ్ అనుభవం ద్వారా అర్దం అయింది. ఇక్కడ మన టీంమేట్స్ తమిళ వాళ్ళు ఉంటే వాళ్ళతో ఏ విషయం కూడా వాదించ కూడదు, వాళ్ళ అభిప్రాయాలు ఎప్పటికీ మారవు, తాబట్టిన కుందేటికి మూడేకాళ్ళు అని వాదిస్తారు, వెంటనే సూర్రెడ్డిని తను అప్పట్లో చెప్పిన డైలాగ్ గుర్తు చేసుకుని వాళ్ళతో వాదన చెయ్యడం ఆపేస్తాను, లేకపోతే "రామాయణం ముందు తమిళంలో రాస్తే వాల్మీకి దాన్ని కాపీ కొట్టాడు...." అంటే మనమేం చెయ్యగలం....
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
శీనుగాడు, సూర్రెడ్డి వాదనల వల్ల "వాదనల వల్ల అభిప్రాయాలు మారతాయి" అనే నీ అభిప్రాయాయం మార్చుకున్నావు కదరా.. మరి ఇంకా వాదనల వల్ల అభిప్రాయాలు మారవంటావేమిటి?
మరి మన తమిళ తంబీలు కూడా మెండుగా వాదించి నిన్ను ఈ స్థితికి తీఉకొచ్చారాయే.....
Post a Comment