Sunday, December 9, 2007

న్యూయార్క్ మహానగరంలో మొదటి రోజు....

న్యూయార్క్ మహానగరంలో మొదటి రోజు....
డిసెంబెర్ 6 మధ్యాహ్నం 1:45 కి దాదాపుగా 20 గంటల ప్రయాణం తరువాత నేనెక్కిన ఎమిరేట్స్ విమానం న్యూయార్క్ జె.ఎఫ్.కె అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆగింది. నా బ్యాగ్ తెరిచి ఉలెన్ స్వెట్టర్, దాని పైన ఇంకొక జాకెట్ వేసుకుని కిందకి దిగాను, అంతా విచిత్రం గా ఉంది. అది మధ్యాహ్నం కావటం చేత మావాళ్ళెవరు నన్ను రిసీవ్ చెసుకోవడానికి రాలేదు. దాదాపుగా ఒక కిలోమీటర్ నడిచి ఇమ్మిగ్రేషన్ కౌంటర్ కి వచ్చాను, అక్కడొక తెల్లవాడు ఉన్నాడు, వాడి భాష నాకు అర్ధం అవుతుందా అనుకుంటూ వెళ్ళాను, నాకు మొదటి సారి మనకు అమెరికాకి ఉన్న తేడా తెలిసింది (నాకేమీ మన దేశం పైన తక్కువ భావం లేదు కానీ మంచి ఎక్కడ ఉన్నా నేర్చుకోవాలి కదా...), వాడు చాలా గౌరవంగా మాట్లాడి నా ఐ-94 మీద స్టాంప్ వేసి ఇచ్చాడు. తరువాత బయటికి వచ్చి నా రెండు పెద్ద బ్యాగ్ లు తీసుకున్నాను.
బ్యాగ్ లు మోసుకువెళ్ళడానికి ట్రాలి కోసం చుట్టూ చూస్తే ఒకడు ట్రాలీలు అద్దెకి ఇస్తూ కనపడ్డాడు, దగ్గరికి వెళ్ళి విషయం కనుక్కుంటే $3 ఇస్తే ట్రాలీ ఇస్తాను అన్నాడు, నేను చెన్నై లో ఉచితంగా వాడుకున్న దానికే వీడు అద్దె వసూలు చేస్తున్నాడు ఈ విషయంలో మన విమానాశ్రయాలే మెరుగేమో. నేను కూడా $3 ఇచ్చి ఒక ట్రాలీ అద్దెకి తిసుకున్నాను, బ్యాగ్ లు అన్నీ దాని మీద వేసుకుని అసలే వాటి నిండా ఫుడ్, మందులు ఉన్నాయని, చెక్ చెయ్యడానికి వీడు ఇప్పుడు నన్నెక్కద బట్టలు విప్పమంటాడో అని భయపడుతూ కస్టంస్ వాడి దగ్గరికి వెళ్ళాను, అద్రుష్టవశాత్తూ వాడు నా బ్యాగ్ కూడా తెరవమనకుండానే కస్టంస్ క్లియరెన్స్ ఇచ్చేశాడు. బ్రతుకుజీవుడా అనుకుంటూ బయటికి వచ్చేశాను, తెలియని మనుషుల మధ్య తెలియని దేశం లో ఒక్కడినే ఉన్నానని మొదటిసారి భయం వేసింది.
అక్కడ ఉన్న సెక్యురిటీ వాడిని టాక్షీ ఎక్కడ దొరుకుతుంది అని అడిగాను, వాడి భాషలో వాడేదో చెప్పాడు ఒక్క ముక్క కూడా అర్దం కాలేదు, కానీ వాడు చేత్తో చూపించిన గుర్తు పట్టుకుని నా ట్రాలీ తోసుకుంటూ వెళ్ళాను, అక్కడ ఒక సెక్యూరిటీ వాడు అందరినీ టాక్షీ ఎక్కిస్తుంటే వెళ్ళి నా హోటెల్ అడ్రెస్ వాడి చేతిలో పెట్టేసి టాక్షీ కావాలి అని చెప్పాను, ఒక 5 నిముషాల తరువాత టాక్షీ వచ్చింది, అది ఎక్కి కూర్చుని ద్రైవర్ చేతిలో కూడా అడ్రెస్ కాగితం పెట్టేశాను, ఒక 40 నిముషాల తరువాత నన్ను హోటెల్ ముందు ఆపాడు, ఎంత అంటే $45 అద్దె + టోల్ ఫీ $5 మొత్తం $50 అన్నాడు అంటే 40 నిముషాల ప్రయాణానికి ఋస్ 2000/- అనుకుని వాడికి దబ్బులు ఇచ్చేశాను, వాడేమనుకున్నా సరే అని టిప్ ఇవ్వలేదు, వాడు అదో రకంగా చూసి వెళ్ళిపోయాడు :).
హొటెల్ రిసెప్షన్లోకి వెళ్ళి నా రెజర్వేషన్ కాగితం చూపిస్తే అదేమో సెక్యూరిట్య్ దిపాజిట్ కట్టాలి, క్రెడిట్ కార్డ్ అడిగింది, నాకు క్రెడిట్ కార్డ్ లేదు అంటే "ఏమిటి క్రెడిట్ కార్డ్ లేకుండా మనుషులు ఉంటారా?" అన్నట్టు చూసింది. మొత్తానికి 5 నిముషాలు వివరించి చెప్పిన తరువాత నా దగ్గర ఉన్న అతి కొద్ది డాలర్లలో $200 తిసుకుని నాకు రూం ఇచ్చింది. అప్పటికే నేను తెచ్చుకున్న డబ్బులలో సగం ఖర్చు అయిపోయింది, నా సేలరీ అడ్వాన్స్ రావడానికి ఒక వారం పడుతుంది, ఏమి చెయ్యాలా అని అలోచిస్తూ ఎలివేటర్ ఎక్కాను, నా బ్యగ్లు అన్నీ మోసుకుంటూ దానిలోకి లాగాను, నేను వెళ్ళాల్సిన ఫ్లోర్ నంబర్ 6 నొక్కుతుంటే బటన్ ప్రెస్ కావట్లేదు, ఈ లోపుగా అది 8 వ ఫ్లోర్ లోకి వెళ్ళిపోయింది, అక్కడొక తెల్లవాడు ఎక్కి ఎలివేటర్ ఎలా ఆపరేట్ చెయ్యాలో నేర్పాదు. మొత్తానికి నా ఫ్లోర్ కి వచ్చి నా రూం వెతుక్కుని బ్యాగ్లు అందులో పడేసి బ్రష్ చేసుకుని రూం లో కాఫీ మేకర్ ఉంతే కాఫీ చేసుకుని తాగి చక్కగా వేడి నీళ్ళతో స్నానం చేసే సరికి సగం అలసట వదిలింది. అప్పుడు సమయం దాదాపుగా సాయంత్రం 5.00 అవుతొంది, ముడు పొరలు డ్రెస్ లు వేసుకుని మంకీ కాప్, చేతికి గ్లౌస్ వేసుకుని బయతికి వచ్చాను. ఇది ఆన్సైట్ కో ఆర్డినేటర్ రోల్ కాదని చెప్పి నాకు లాప్ టాప్ ఇవ్వలేదు, హోటెల్ లాబీ లో కంప్యూటర్ ఉంటే అక్కడ మెయిల్ చెక్ చేసుకుని మన్ హట్టన్ వీదులలోకి వచ్చాను.
పక్కనే కనిపిస్తుంది కదా అని ఎంపైర్ స్టేట్స్ భవనం వైపు నడవడం మొదలు పెట్టాను, దాదాపు 20 నిముషాలు నడిచిన తరువాత అక్కడికి చేరాను, అబ్బ ఎంత పెద్దగా ఉంది అనుకుంటూ తిరిగి వచ్చాను, మధ్యలో సొసైటీ జెనెరల్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, యు.బి.ఎస్, మా లెహమాన్ బ్రదర్స్ భవనాలు చూస్తూ తిరిగి వచ్చి, ఎం.టి.ఆర్ సాంబార్ రైస్ వేడి చేసుకుని తిని పడుకున్నాను.
--రామకృష్ణ బైసాని.

No comments: